Vijay Yesudas - Evare 歌词

తెలవారితే కనురెప్పల తొలి మెలకువ నువ్వే
నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే
పొలమారితె నీ మనసుకి అది నా పొరపాటే
నీ పేరే పలకడమే పెదవులకలవాటే
వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే
వేకువలా చూస్తుందే నువు నడచిన బాటే
ప్రాణాలే తీస్తుందే నీ ఊహల తోటే
నా మనసే నీదయ్యే వినదే నా మాటే
ఎవరే...
ఎవరే ప్రేమను మాయంది
ఎవరే... ఈ హాయికి హృదయం చాలంది
ఎవరే నిన్నే నా వైపు నడిపే
నా ఊహల మధురోహల హరివిల్లు నింపే
తియతియ్యని నిమిషాలే నిలోన ఒంపే
నా ఒంటరి కాలాన్నే నీతోన చెరిపే
ఆ దైవమే నాకు చెప్పింది ఎపుడో
నీ చిన్ని చిరునవ్వే విలువైన వరమంటు
నా ప్రాణమే నీకు చెపుతోంది ఇపుడు
నువ్ లేక నే లేనని
గది లాంటి మదిలో
నది లాంటి నిన్నే
దాచేయ్యాలనుకుంటే అది నా అత్యాశే
అడుగంత దూరం
నువు దూరమైన
నా ఊపిరి చిరునామ తెలిపేదెవరే...
ఎవరే...
వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే
వేకువలా చూస్తుందే నువు నడచిన బాటే
ప్రాణాలే తీస్తుందే నీ ఊహల తోటే
నా మనసే నీదయ్యే వినదే నా మాటే
ఎవరే...
ఎవరే ప్రేమను మాయంది
ఎవరే... ఈ హాయికి హృదయం చాలంది
ఓ... ఓ... ఒ... ఒ... ఓ...
这个歌词已经 439 次被阅读了