మన చిరునవ్వులే పూలు నిట్టూర్పులే తడి మేఘాలు
హృదయమే గగనం రుధిరమే సంద్రం ఆశే పచ్చదనం
మారే ఋతువుల వర్ణం మన మనసుల భావోద్వేగం
సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం
నువ్వెంత నేనెంత రవ్వంత ఎన్నో ఏళ్లదీ సృష్టి చరిత
అనుభవమే దాచిందీ కొండంత తన అడుగుల్లో అడుగేసి వెళదాం జన్మంతా
ఎవడికి సొంతమిదంతా ఇది ఎవ్వడు నాటిన పంట
ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్టా
తరములనాటి కథంతా మన తదుపరి మిగలాలంట
కదపక చెరపక పదికాలాలిది కాపాడాలంట
ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం ఇష్టంగా గుండెకు హత్తుకుందాం
కన్నెర్రై కన్నీరై ఓ కొంచెం తల్లడిల్లిందో ఈ తల్లీ ఏ ఒక్కరు మిగలం