Anirudh Ravichander - Hoyna Hoyna 歌词

వేరే కొత్త భూమిపై ఉన్నానా
ఏదో వింత రాగమే విన్నానా
వేరే కొత్త భూమిపై ఉన్నానా

ఏదో వింత రాగమే విన్నానా

పలికే పాలగువ్వతో, కులికే పూలకొమ్మతో
కసిరే వెన్నెలమ్మతో స్నేహం చేశా
ఎగిరే పాలవెల్లితో, నడిచే గాజుబొమ్మతో
బంధం ముందు జన్మదా ఏమో బహుశా

హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా
ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా
హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా
కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా

Think I caught the feels this summer
Bae you're one of a kind no other
Be my sweetie, be my sugar
Had enough as a one side lover

I think I caught the feels this summer
Bae you're one of a kind no other
Be my sweetie, be my sugar
Had enough as a one side lover

నా జీవితానికి రెండో ప్రయాణముందని
దారి వేసిన చిట్టి పాదమా
నా జాతకానికి రెండో భాగముందని
చాటి చెప్పిన చిన్ని ప్రాణమా

గుండెల్లోన రెండో వైపే చూపి
సంబరాన ముంచావే నేస్తమా
నాలో నాకే రెండో రూపం చూపి
దీవించిందే నీలో పొంగే ప్రేమ

వెలిగే వేడుకవ్వనా, కలిసే కానుకవ్వనా
పెదవుల్లోన నింపనా చిరుదరహాసం
ఎవరో రాసినట్టుగా జరిగే నాటకానికి
మెరుగులు దిద్ది వెయ్యనా ఇహ నా వేషం

హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా
ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా
హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా
కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా

వేరే కొత్త భూమిపై ఉన్నానా
ఏదో వింత రాగమే విన్నానా
వేరే కొత్త భూమిపై ఉన్నానా
ఏదో వింత రాగమే విన్నానా
这个歌词已经 116 次被阅读了