Shweta Mohan - Nee Selvadigi Şarkı Sözleri

చిత్రం: జనతా గ్యారేజ్ (2016)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి

నీ శెలవడిగి నే కదిలెళుతున్నా
నా కలలన్నీ నీతో వదిలెళుతున్నా
ఎంతనుకున్నా ఏదో బాధ
మెలిపెడుతోందే లోపలా
అనుకుంటే మరి తెగిపోయేదా
మన అనుబంధం నేటిదా

భారంగా ఉంది నిజం
దూరంగా వెళుతోంది జీవితం
నీ మాటే నా నిర్ణయం
నీ కోసం ఏదైనా సమ్మతం
Bu şarkı sözü 273 kere okundu.