నీలో ఈ చలనం, మరి కాదా సంచలనం,
చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కధనం!
నీలో ఈ జడికి, చెలరేగే అలజడికి,
గెలుపల్లే మొదలై చరితగ మారే నీ పయనం!
నీ ఆశయమే తమ ఆశ అని, తమకోసమని తెలిసాక,
నువు లక్ష్యమని తమ రక్షవని నినదించేలా...
పదర పదర పదరా!
నీ గతముకు కొత్త జననమిదిరా!
నీ ఎత్తుకు తగిన లోతు ఇది, తొలి పునాది గది తలుపు తెరిచి పదరా!
పదర పదర పదరా!
ప్రతొక్కరి కథవు నువ్వు కదరా!
నీ ఒరవడి భవిత కలల ఒడి, బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా!
తనని తాను తెలుసుకున్న హలముకు పొలముతో ప్రయాణం
తనలోని ఋషిని వెలికితీయు మనిషికి లేదు ఏ ప్రమాణం
ఉషస్సు ఎంత ఊపిరిచ్చి పెంచిన కాంతిచుక్కవో
తరాల వెలితి వెతికి తీర్చవచ్చిన వెలుగురేఖవో...