తకిట తకజం
తకిట తకజం
పలికే నా గుండెలో
ఏడు రంగుల ప్రేమ ఖనిజం
మెరిసినే నా కళ్లలో
గుండె చప్పుడుకే ఒక రూపమే నువ్వు
వందేళ్ల ఊపిరిపై నీ పేరు రాసివ్వు
రెప్పనార్పే కన్నుకే ఆ అలవాటునాపావు
ఇంత అందం లేదిక అని రుజువు చేశావు
తకిట తకజం
తకిట తకజం
పలికే నా గుండెలో
ఏడు రంగుల ప్రేమ ఖనిజం
మెరిసినే నా కళ్లలో
నెమలి కన్నె కుంచె పట్టి
గీసెనే నీ కన్నులే
ఓ తుమ్మెదలను తెగ కొల్లగొట్టి
తేనె దాచిన పెదవులే
చప్పుడయ్యే గుండెకే అలవాటునాపావు
ఆపలేనే నన్నిక నా ప్రాణం అయ్యావు
తకిట తకజం
తకిట తకజం
పలికే నా గుండెలో
ఏడు రంగుల ప్రేమ ఖనిజం
మెరిసినే నా కళ్లలో
నిన్ను చూసిన ఈ క్షణానికి
పచ్చ బొట్టయ్యానులే
నువ్వు విడిచే శ్వాస లోన
గాలిపటము అయ్యానులే
కళ్లగంతలు కట్టినా ఆ అడుగు నీ వెంటే
ఒక్క మాటలో చెప్పనా నువ్వే నేనంటే
తకిట తకజం
తకిట తకజం
పలికే నా గుండెలో
ఏడు రంగుల ప్రేమ ఖనిజం
మెరిసినే నా కళ్లలో