Raghu Dixit - Rock On Bro Şarkı Sözleri

చిత్రం: జనతా గ్యారేజ్ (2016)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి

రాక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు
గడిపేద్దాం లైఫు కింగు సైజు
ఒకే గదిలో ఉక్కపోత చాలు
గడి దాటాలి కళ్ళు కాళ్లు కలలు
ఏ దిక్కులో ఏమున్నదో
వేటాడి పోగు చేసుకుందాం ఖుషీ
మన్నాటలో చంటోడిలా
ఆహా అనాలి నేడు మనలో మనిషి

మనసిపుడు మబ్బులో విమానం
నేలైనా నింగితో సమానం
మత్తుల్లో ఇదో కొత్త కోణం
కొత్త ఎత్తుల్లో ఎగురుతుంది ప్రాణం
ఆనందమో ఆశ్చర్యమో
ఏదోటి పొందలేని సమయం వృధా
ఉత్తేజమో ఉల్లాసమో
ఇవాల్టి నవ్వు రంగు వేరే కదా

మనమంతా జీన్సు ప్యాంటు రుషులు
బ్యాక్ ప్యాక్ లో బరువు లేదు అసలు
విన్లేదా మొదటి మనిషి కథలు
అలా బతికేద్దాం ఓ నిండు రేయి పగలు
ఇదీ మనం ఇదే మనం
క్షణాల్ని జీవితంగా మార్చే గుణం
ఇదే ధనం ఈ ఇంధనం
రానున్న రేపు వైపు నడిపే బలం
Bu şarkı sözü 314 kere okundu.